ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా ఉత్సవాలు విజయవంతం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-10-17T06:21:14+05:30

దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, అక్టోబరు 16 : దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు. శుక్రవారం దుర్గాఘాట్‌ వద్ద తెప్పోత్పవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 7 నుంచి 15 వరకు జరిగిన ఈ ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మూలానక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్ర్తాల సమర్పణకు సీఎం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు, దర్శనానికి వచ్చే లక్షమందికి పైగా భక్తులను సమన్వయం చేసుకుంటూ ఎక్క డా అవంతరాలు లేకుండా చూశామన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాల సహకారంతో విజయవంతం చేశామన్నారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పరిశుభ్రత పాటించండి

దసరా ఉత్సవాలు ముగిసినా శనివారం భారీగా భవానీలు, కుటుంబసభ్యులు, ఇతర భక్తులు రావటంతో స్థానిక పరిస్థితులను స్వయంగా చూ సేందుకు కలెక్టర్‌ నివాస్‌ ఘాట్లు, కేశఖండనశాల, ప్రసాదాల తయారీ కేంద్రం, విక్రయ కౌంటర్లు, క్యూలు ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కృష్ణవేణి ఘాట్‌ను పరిశీలించి పరిశుభ్రతకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండు రోజుల పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వరాదన్నారు. భవానీలు వదిలిపెట్టిన దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కేశఖండనశాల, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రసాదాల కౌంటర్‌, లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి నాణ్యతలో, తూకంలో రాజీ వద్దని సూచించారు. జేసీ, సబ్‌కలెక్టర్‌, సీఎంహెచ్‌వో కలెక్టర్‌ వెంట ఉన్నారు.

విజయవంతంగా నిర్వహించాం : సీపీ

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి) : దసరా ఉత్సవాలను పోలీసుల సహకారంతో విజయవంతంగా నిర్వహించా మని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిలో 30మంది అనారోగ్యం బారిన పడ్డారన్నారు. వారికి నగరంలోనే చికిత్స చేయిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2021-10-17T06:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising