ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే వేటు

ABN, First Publish Date - 2021-03-07T06:40:17+05:30

వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే వేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) :  కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు అత్యవసర బులెటిన్‌ను విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు లబ్ధి కలిగేలా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేయటం నిషిద్ధమన్నారు. ఈ ఆదేశాలను ఎవరైనా పక్కన పెడితే తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా వార్డు వలంటీర్లు ఎన్నికల నిబంధనలను కాదని అభ్యర్థులకు ప్రచారం చేసినా, లబ్ధి కలిగించే పనులు చేసినా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. దీనికోసం 24 గంటలూ పనిచేసే వాట్సాప్‌ నెంబర్‌  8186038738కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ-మెయిల్‌ అడ్రస్‌ ఛీఞ్ఛౌజ్ఛూఛ్టిజీౌుఽట 2021ఃజఝ్చజీజూ.ఛిౌఝ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

Updated Date - 2021-03-07T06:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising