ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాదులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2021-01-17T06:08:28+05:30

యానాదులను ఆదుకుంటాం

యానాదుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, జనవరి 16 : వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న యానాదులను ఆదుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌ ప్రతిష్టా మాంగైన్‌, జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి రుక్మాంగదయ,  తహసీల్దార్‌ ఆర్‌.దుర్గాప్రసాద్‌తో కలిసి పెదఅవుటపల్లి యానాదులకాలనీలో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో కాలువగట్టు పక్కన జీవిస్తున్న యానాదుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందటంలేదని రామారావు అనే సామాజిక కార్యకర్త ఫోన్‌లో తనకు ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు  వచ్చినట్టు తెలిపారు. గ్రామంలో 95 యానాదుల కుటుంబాలున్నాయని, వీరంతా నిరక్షరాస్యులని, 63 కుటుంబాలకు మాత్రమే రేషన్‌, ఆధార్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. వీరందరికీ సొంత ఇల్లు మంజూరు చేశామని, మిగతా 32 కుటుంబాలకు సర్వే చేపట్టి ఆధార్‌కార్ఢు నమోదు చేయించి, త్వరలోనే రేషన్‌ కార్డుతో పాటు సొంత ఇంటిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.ఎస్సై. జి.శ్రీనివాసరావు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising