ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం మాట్లాడాలి

ABN, First Publish Date - 2021-07-13T15:00:26+05:30

నూతన జాబ్‌ క్యాలెండర్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ బైక్‌ ర్యాలీ

అడ్డుకున్న పోలీసులు, పలువురికి గాయాలు


ఇబ్రహీంపట్నం: నూతన జాబ్‌ క్యాలెండర్‌పై తక్షణం సీఎం జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు మాట్లాడాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.నాగేశ్వరరావులు డిమాండ్‌ చేశారు. కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐల ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన మోటార్‌బైక్‌ ర్యాలీని రింగ్‌సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలువురు నిరుద్యోగులకు గాయాలయ్యాయి. నేతలతో పాటు నిరుద్యోగులను అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గతనెల 18 నుంచి నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీతో సీఎం సమాధానం చెప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగుల అక్రమ అరెస్టులు, ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు. జిల్లా అధ్యక్షులు ఎన్‌.కోటిబాబు, పి.కృష్ణలు మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు లక్షల్లో పోస్టులుంటే కేవలం 10 వేల పోస్టులు మాత్రమే భర్తిచేయడం మోసం చేయడం కాక మరేంటని ప్రశ్నించారు. ఈనెల 19న సీఎం కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీహెచ్‌ వెంకటేశ్వరరావు, లాల్‌సలామ్‌, లెనిన్‌, నిజాముద్దీన్‌, వంశీ, రాజేష్‌, ఏసుబాబు, ప్రసాద్‌, బి.వెంకటేశ్వరరావు, ప్రణయ్‌తేజ, గోపి నాయక్‌, సురేష్‌, హుస్సేన్‌, భార్గవ్‌, కుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-13T15:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising