ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్టజీవులదే: CM Jagan

ABN, First Publish Date - 2021-08-24T17:42:14+05:30

అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్టజీవులదే.. ఆ సొమ్మునే కాజేయాలని చూశారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్టజీవులదే.. ఆ సొమ్మునే కాజేయాలని చూశారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నగదును జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.666.84 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఓ ప్రైవేట్‌ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును...ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలోని వ్యక్తుల కోసం జరిగిన మోసం ఇది అని విమర్శించారు.  అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియగా జరిగిన అగ్రిగోల్డ్‌ స్కాం ఇది అని సీఎం ఆరోపించారు. డిపాజిట్‌దారుల సంఖ్య గత ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. ఎన్నికలకు ముందు జీవో ఇచ్చారని.. కానీ రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-24T17:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising