ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ఉద్యోగి కుమారుడు సివిల్స్‌లో సత్తా చాటాడు!

ABN, First Publish Date - 2021-09-29T06:48:27+05:30

రైల్వే ఉద్యోగి కుమారుడు సివిల్స్‌లో సత్తా చాటాడు!

రైల్వే డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌తో సివిల్స్‌ ర్యాంకర్‌ చంద్రకాంత్‌రెడ్డి, తండ్రి వెంకటేశ్వర్లు రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ స్థాయిలో 120 వ ర్యాంకు సాధించిన బి.చంద్రకాంత్‌రెడ్డి 

 కుటుంబ సభ్యులను అభినందించిన రైల్వే డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలలో విజయవాడ రైల్వే కమర్షియల్‌ బ్రాంచి ఉద్యోగి తనయుడు బద్దెలి చంద్రకాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అఖిల భారత స్థాయిలో 120వ ర్యాంకును సాధించాడు. విజయవాడ రైల్వే డివిజన్‌లో ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌, వర్క్స్‌ విభాగం చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ బద్దెలి వెంకటేశ్వర్లు రెడ్డి కుమారుడు బద్దెలి చంద్ర కాంత్‌రెడ్డి అద్వితీయమైన ర్యాంకును సాధించటం పట్ల విజయవాడ డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ కుటుంబ సభ్యులను, చంద్రకాంత్‌రెడ్డిని అభినందించారు. తన మూడవ ప్రయత్నంలో చంద్రకాంత్‌రెడ్డి యూపీఎస్సీ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. చంద్రకాంత్‌రెడ్డి 2017వ సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 89 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేశాడు. పదవ తరగతిలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. చదువులో తన కుమారుడిని ప్రతిభను గుర్తించి సివిల్స్‌కు ప్రిపేర్‌ చేయించారు. మొదటి, రెండు ప్రయత్నాలలో ఆశాజనక ఫలితం రాకపోయినా మూడవ ప్రయత్నంలో మాత్రం 120 ర్యాంకును సాధించాడు. 


Updated Date - 2021-09-29T06:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising