ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులను తలపిస్తున్న వరి పొలాలు

ABN, First Publish Date - 2021-11-27T06:34:02+05:30

చెరువులను తలపిస్తున్న వరి పొలాలు

వీరవల్లిలో నీటిలో మునిగిపోయిన వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడవకొల్లు(ఉయ్యూరు), నవంబరు 26 : ఉయ్యూరు  మండలం కడవకొల్లు గ్రామ పంచాయతీ  వీరవల్లి గ్రామ పరిధిలో వరిపొలాల్లో నీరు నిలిచి చెరువుల్లా కన్పిస్తున్నాయి. పురుగుల డొంక ప్రాంతంలో మురుగు కాల్వ పూడుకుపోయి పొలాల్లో నీరు పోయే మార ్గంలేక మోకాలు లోతు నీళ్లు నిలిచి వరి పంట నీటిలో మునిగి కంకులనుంచి మొలకలు వస్తున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో వరిపంట నేల వాలగా పల్లపు ప్రాంతాల్లో నీరు పోయేందుకు మార్గంలేక నిలిచిపోయింది. మురుగు కాల్వచెత్త పెరిగి,  పక్కన ఉన్న చెట్లకొమ్మలు విరిగి పడిపోగా నీరు పోవడం లేదని, కాల్వ బాగు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కున్న వారు లేరని వాపోతున్నారు. నీటిలో నానుతున్న వరి కుళ్లి కోత కోసేందుకు కూడా పనికి రాకుండా పోతుందని,  నీటిలో నాని కంకులనుంచి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రోజులు నీరు నిలిచి ఉంటే పంట కోయకుండా దమ్ము చేయవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-27T06:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising