ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని ఆపేసి క్షమించరాని తప్పు చేశారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-11-07T21:13:30+05:30

రైతుల శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చంద్రబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, అమరావతిని ఆపేసి క్షమించరాని తప్పు చేశారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రైతుల పాదయాత్రను అడ్డుకుని  చరిత్ర హీనులుగా మిగలొద్దన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోందన్నారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కల్పిస్తోందని ఆరోపించారు. పోలీసులను అడ్దుపెట్టుకుని  ఉక్కుపాదం మోపుతోందన్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.


పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదని చంద్రబాబు అన్నారు. జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు అని నిన్న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారని, వారికి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. సీఎంకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని అంథకారంలోకి నెట్టి క్షమించరాని తప్పు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-07T21:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising