ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో మరో రెండు ఎలక్ట్రికల్‌ శ్మశాన వాటికలు

ABN, First Publish Date - 2021-04-24T05:20:26+05:30

నగరంలో మరో రెండు ఎలక్ట్రికల్‌ శ్మశాన వాటికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, ఏప్రిల్‌ 23 : నగరంలో మరో రెండు ఎలక్ట్రికల్‌ శ్మశాన వాటికలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన రెవెన్యూ, నగరపాలక సంస్థ, గవర్నమెంట్‌ ఆసుపత్రుల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం కృష్ణలంకలో ఉన్న విద్యుత్‌ శ్మశాన వాటికలో మాత్రమే దహన సంస్కారాలు జరుగుతున్నాయని, త్వరలో అజిత్‌సింగ్‌నగర్‌, విద్యాధరపురంలో కూడా విద్యుత్‌ దహన సంస్కార సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతదేహాలను మార్చురీలో భద్రపరిచి, బంధువులకు అప్పజెప్పే క్రమంలో కాలయాపన చేయకూడదని సూచించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ మోహనరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జీజీహెచ్‌ ఆర్‌ఎంవో హనుమంతరావు, వీఎంసీ అధికారి ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T05:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising