ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ చేపల చెరువుల కట్టలు తొలగించరేం..?

ABN, First Publish Date - 2021-06-07T05:14:33+05:30

అక్రమ చేపల చెరువుల కట్టలు తొలగించరేం..?

బుడమేరులో అక్రమ చెరువు కట్టలను పరిశీలిస్తున్న మురాల రాజేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు రోజుల్లో చదును చేయించకపోతే ఆందోళన

అధికారులపై దళిత రైతుల ఆగ్రహం

నందివాడ రూరల్‌ (గుడివాడ), జూన్‌ 6 : కుదరవల్లి సరిహద్దులో బుడమేరులో అక్రమంగా తవ్వడానికి తలపెట్టిన చేపల చెరువుల కట్టలను చదును చేయిస్తామని చెప్పిన అధికారులు మౌనం దాల్చడంపై దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుల నిర్మాణానికి యత్నించిన బడాబాబులపై చర్యలు తీసుకోకపోవడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురాల రాజేశ్‌ ప్రశ్నించారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించిన ఆయన చేపల చెరువుల కట్టలను ఎత్తుగా పోయడంతో ఖరీఫ్‌లో తాము పంటలను ఎలా సాగు చేసుకోవాలన్నారు. దళిత రైతుల భూములను ఎందుకూ పనికిరాకుండా చేసిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో కట్టలను తీయకపోతే డ్రెయినేజీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.  ఈ పరిశీలనలో దళిత రైతులు గుజ్జుల నాగభూషణం, కాకి ఎహుషువా, కాకి దేవదాసు, కోరం అన్నమ్మ, సకలాబత్తిన సుబ్బమ్మ, చేబత్తిన శుభాకరరావు, గుజ్జుల చంద్రహాస్‌, కోరం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-07T05:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising