టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా బోడె ప్రసాద్
ABN, First Publish Date - 2021-07-09T06:22:50+05:30
టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా బోడె ప్రసాద్
పోరంకిలోని పార్టీ కార్యాలయంలో బోడె ప్రసాద్‌కు అభినందనలు తెలుపుతున్న టీడీపీ శ్రేణులు
పెనమలూరు, జూలై 8: టీడీపీ మచిలీపట్నం పార్టమెంట్ ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నియమితులయ్యారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపాయి. అధ్యక్షుడిగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉపాఽధ్యక్షుడిగా కానూరుకు చెందిన వెలగపూడి శంకరబాబును నియమించారు. కార్యక్రమంలో మారుపూడి ధనకోటేశ్వరరావు, బొర్రా కృష్ణ, వడ్లమూడి శుభశేఖర్, కోయ ఆనంద్, నూకల పవన్ కుమార్, కొల్లిపర ప్రమోద్ పాల్గొన్నారు.
Updated Date - 2021-07-09T06:22:50+05:30 IST