జగన్ గజినీలాగా మారిపోయాడు: నాగభూషణం
ABN, First Publish Date - 2021-06-11T18:10:24+05:30
గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పతనాన్ని కోరుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అన్నారు.
అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పతనాన్ని కోరుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అన్నారు. జగన్ గజినీలాగా మారిపోయాడని... జగన్ ఆనాడు రాజధాని గురించి ఏం మాట్లాడాడో వాళ్ల మంత్రులు మర్చిపోయారని విమర్శించారు. కరకట్ట వద్ద డ్రిడ్జింగ్ పనుల వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని... కట్టకి ఆనుకొని ఉన్న రైతుల పొలాల్లో మట్టి వేస్తే అధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కరకట్ట బలహీన పడితే గ్రామాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డ్రిడ్జింగ్ విధానం సరికాదని...పొలాల రైతులకు కౌలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలాల్లో డ్రిడ్జింగ్ లేకుండా చూడాలని..లేకుంటే బీజేపీ తరుపున ఆందోళన తీవ్రతరం చేస్తామని పాతూరి నాగభూషణం హెచ్చరించారు. శుక్రవారం కృష్ణానది ఒడ్డున డ్రిడ్జింగ్ చేసి ఇసుక తవ్వకాల పేరుతో కరకట్టను బలహీనపరుస్తున్నారంటూ కరకట్ట డ్రిడ్జింగ్ పనుల వద్ద బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల్లోకి మట్టి పోస్తున్నారంటూ బీజేపీ నేతలకు రైతులు మొర పెట్టుకున్నారు.
Updated Date - 2021-06-11T18:10:24+05:30 IST