ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కసారి ఛాన్స్ అని వచ్చి...: Lanka dinakar

ABN, First Publish Date - 2021-10-12T14:56:38+05:30

ఒక్కసారి ఛాన్స్ అని వచ్చిన జగన్... నిన్న ప్రజల నెత్తిన ట్రూఅప్ చార్జ్‌ల పిడుగు, నేడు పవర్ కట్‌తో ఉక్కపోత పోయిస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఒక్కసారి ఛాన్స్ అని వచ్చిన  జగన్... నిన్న ప్రజల నెత్తిన ట్రూఅప్ చార్జ్‌ల పిడుగు, నేడు పవర్ కట్‌తో ఉక్కపోత పోయిస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే చేసిన పీపీఏల రద్దు వల్ల నేడు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినా విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. దేశంలో 20 రోజుల వరకు ధర్మల్ విద్యుత్‌కి అవసరమైన బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి కొరత అనడం రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రణాళిక, నిర్వహణ లోపమని వ్యాఖ్యానించారు. కర్నూల్‌లోని సోలార్ కంపెనీకి జగన్ ఇబ్బందులు పెట్టడంతో, రాష్ట్రంలో అవకాశం ఉన్నా కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాలేదరి తెలిపారు. ఎవరు అధికారంలో ఉన్నా పవర్ కట్ ఇబ్బందులు ఎలా అధిగమించ పోతున్నారో చెప్పేవారని, ఇప్పుడు పవర్ ఎలా కట్ చేయబోతున్నారో చెబుతున్నారని అన్నారు. నాణ్యత లేని మద్యం అమ్మకాలపైన ఉన్న దృష్టి ప్రజలకు అవసరమైన విద్యుత్‌పైన జగన్‌కు లేదని లంకా దినకర్ విమర్శించారు. 

Updated Date - 2021-10-12T14:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising