ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిశ్శబ్ద వారధి

ABN, First Publish Date - 2021-10-28T06:16:42+05:30

శబ్ద కాలుష్యం లేని ఫ్లై ఓవర్‌ను మీరెప్పుడైనా చూశారా?

బెంజ్‌సర్కిల్‌ - 2 ఫ్లైౖ ఓవర్‌పై సిద్ధంగా ఉన్న యూవీ ఫైబర్‌ షీట్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌పై ధ్వని కాలుష్య నివారణ వ్యవస్థ

సర్వీసు రోడ్డు సైడ్‌వాల్‌పై ప్రత్యేక ఏర్పాట్లు 

పక్కనే ఉన్న కాలనీల్లో ప్రశాంతత కోసమే

నగరంలో ఈ తరహాలో ఇదే మొదటి వంతెన


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : శబ్ద కాలుష్యం లేని ఫ్లై ఓవర్‌ను మీరెప్పుడైనా చూశారా? బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ను చూస్తే చాలు. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను దాదాపు పూర్తిచేసిన కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా శబ్ద కాలుష్యం లేని వ్యవస్థ (నాయుస్‌ రిడక్షన్‌)కు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకూ నగరంలోని ఏ ఫై ్లఓవర్‌కూ ఇలాంటి వ్యవస్థ లేదు. బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌పై రూ.కోటి వ్యయంతో నాయిస్‌ రిడక్షన్‌ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఫ్లై ఓవర్‌కు పడమర దిక్కున సర్వీసు రోడ్డు వెంబడి ఉన్న కాలనీలకు వాహనాల శబ్దం వినిపించకుండా ఆల్ర్టా వయెలెట్‌  ఫైబర్‌ షీటింగ్‌ చేస్తున్నారు. ఎండ, వాన, గాలి.. అన్నింటికీ తట్టుకుని మూడు కాలాలూ నిలబడేలా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లై ఓవర్‌పై ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సర్వీసు రోడ్డు వైపు ఫ్లై ఓవర్‌ సైడ్‌ వాల్‌ మీద ఐరన్‌ పోల్స్‌ను బిగిస్తున్నారు. ఈ పోల్స్‌ అన్నింటినీ కలిపి ఫ్రేమింగ్‌ చేసి, దీనిపై యూవీ ఫైబర్‌ షీట్స్‌ను అమర్చుతారు. ఈ షీట్స్‌లో మూడు పొరలు ఉంటాయి. మధ్య పొర 30 మీటర్ల దూరం వరకు శబ్దాన్ని నిలువరిస్తుంది. రెండు రోజుల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. 

Updated Date - 2021-10-28T06:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising