బలహీన వర్గాల నాయకుడు నడకుదిటి
ABN, First Publish Date - 2021-04-04T06:17:48+05:30
వివాద రహిత మంత్రిగా పేరుపొందిన నడకుదిటి నరసింహారావు మృతి మచిలీపట్నంకు, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
దేవినేని ఉమా నివాళి
మచిలీపట్నం టౌన్ : వివాద రహిత మంత్రిగా పేరుపొందిన నడకుదిటి నరసింహారావు మృతి మచిలీపట్నంకు, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నడకుదిటి నరసింహారావు కుటుంబ సభ్యులను శనివారం దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమా మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో నడకుదిటి బీసీ హాస్టళ్ళు, గురుకులాల భవనాలు నిర్మించారన్నారు. గిలకలదిండి షిపింగ్ యార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేశారన్నారు. మత్స్యసంపదను భద్రపరిచేందుకు గిడ్డంగులు నిర్మించారన్నారు. కేంద్రీయ విద్యాలయం మచిలీపట్నంలో స్థాపించేందుకు చేసిన సేవలు మరువలేమన్నారు. కొల్లు రవీంద్ర, కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రకుమార్, కొక్కిలిగడ్డ నాగరమేష్, ఎస్సీ సంఘాల నాయకులు గుమ్మడి విద్యాసాగర్, యువరాజ్, మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనిల్‌కుమార్, న్యాయవాది లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Updated Date - 2021-04-04T06:17:48+05:30 IST