ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకుల పనివేళల్లో మార్పులు

ABN, First Publish Date - 2021-05-06T06:31:59+05:30

బ్యాంకుల పనివేళల్లో మళ్లీ మార్పులు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పాక్షికంగా కర్ఫ్యూ అమలవుతున్నందున పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకే లావాదేవీలు

విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల పనివేళల్లో మళ్లీ మార్పులు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పాక్షికంగా కర్ఫ్యూ అమలవుతున్నందున పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటివరకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేసేవి. గురువారం నుంచి అన్ని బ్యాంకులు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తాయి. సిబ్బంది సాయంత్రం 4గంటల వరకు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బ్యాంకు పనిచేసినా వినియోగదారులు తమ పనులను 12 గంటల్లోపే ముగించుకోవాలి. ఈకేవైసీ (ఎలకా్ట్రనిక్‌ నో యువర్‌ కస్టమర్‌) విషయంలో వినియోగదారులకు ఊరటనిచ్చే అంశాన్ని ఆర్బీఐ వెల్లడించింది. డిజిటల్‌ లావాదేవీలు పెరగటంతో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతిబ్యాంకు ఈకేవైసీ అమలు చేస్తోంది. దీనిప్రకారం వినియోగదారులు తమ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు ఇవ్వాలి. వాటిని ప్రతి ఏడాది మే నెలాఖరు నాటికి అప్‌డేట్‌ చేయించుకోవాలి. ఈమేరకు ఇప్పటికే బ్యాంకులు నోటీసులు అంటించాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ దీనిపై స్పష్టతను ఇచ్చింది. ఖాతాదారుల ఈకేవైసీ అప్‌డేట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో చేస్తామని, ఒకవేళ నెలాఖరులోపు చేయించుకోకపోయినా చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-06T06:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising