ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు స్పందనపై ఎస్పీకి అభినందన

ABN, First Publish Date - 2021-08-04T06:03:39+05:30

పోలీసు స్పందనపై ఎస్పీకి అభినందన

ఎస్పీని అభినందిస్తున్న మేకావానిపాలెం వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 3: జిల్లా పోలీసు కార్యాలయంలో రోజూ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వితంతువు మేకా సుభాషిణికి అత్తవారి నుంచి రావలసిన ఆస్తి ఇప్పించడంలో ఎస్పీ చొరవ చూపడంతో మంగళవారం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను ఆమె కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. మేకావారిపాలెంకు చెందిన మేకా సుభాషిణి భర్త మార్కండేయులు ఇటీవల మృతి చెందారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. అత్తింటి వారు ఆస్తిలో భాగం ఇవ్వకపోవడంతో సుభాషిణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమస్యను దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌కు ఎస్పీ అప్పగించారు. సమస్యను సత్వరం పరిష్కరించి బాధితురాలికి ఆస్తి ఇప్పించేందుకు అంగీకారం కుదర్చడంతో సుభాషిణి ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీని బాధితురాలు, కుటుంబ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్‌ మేకా శ్రీనివాసరావు కలసి అభినందించారు. డీఎస్పీ రాజీవ్‌కుమార్‌, సీఐ నరే్‌షకుమార్‌, ఎస్సై మస్తాన్‌ఖాన్‌ పాల్గొన్నారు. కాగా, గూడూరుకు చెందిన ఒక మహిళ తన భర్త చనిపోయాడని, తమ స్థలాన్ని బంధువులు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుడివాడకు చెందిన ఒక వ్యక్తి స్థలం అమ్మిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మసుంబాషా, ధర్మేంద్ర పాల్గొన్నారు. అనంతరం పోలీసుల సమస్యలపై ఎస్పీ వినతులు తీసుకున్నారు. బధిరులకు స్మార్ట్‌ఫోన్లు అందజేశారు.


Updated Date - 2021-08-04T06:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising