ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో పీసీఏ ఏర్పాటుకు ప్రభుత్వ యోచన?

ABN, First Publish Date - 2021-06-20T12:40:54+05:30

రాష్ట్రంలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో  పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఎస్‌ఈసీగా కనగరాజ్‌ నియామకం జరుగగా... ఊహించని  పరిణామాలతో హైకోర్టు ఆదేశంతో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏ ఏర్పాటు యోచనలో ఉంది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి.


తెలంగాణలో కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి అని నిబంధనలు ఉన్నాయి. పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ  సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ అథారిటీ ఏర్పాటుపై  నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Updated Date - 2021-06-20T12:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising