ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది రైతుల ఉద్యమం కాదు.. ప్రజా ఉద్యమం: రాయపాటి శైలజ

ABN, First Publish Date - 2021-11-01T18:05:14+05:30

అమరావతి: తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. తుళ్లూరులో వీధులు  కిక్కిరిసిపోయాయి. మహా పాదయాత్రను 9 మంది ముత్తైదువలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అగ్రభాగాన నడుస్తున్నారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ యాత్ర 45 రోజులపాటు, తుళ్లూరు నుంచి తిరుపతి వరకు జరుగుతుందన్నారు. డిసెంబర్ 15న తిరుపతికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతున్నారన్నారు. శాంతి భద్రతలకు ఎలాండి భంగం కలగకుండా తమ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే పాదయాత్రకు అనుమతి నిరాకరించిందన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమం అని అన్నారు. రాజధాని అనేది రైతులది కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టుదలకు పోకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డాక్టర్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-01T18:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising