ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌

ABN, First Publish Date - 2021-03-04T14:10:38+05:30

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌ అయ్యింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని స్పష్టం చేసింది. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది. బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు, ప్రసారాలు వచ్చాయని... దీన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందని తెలియజేసింది. తిరుపతి ఏడో వార్డులో నామినేషన్‌ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలు వచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్‌వో‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనిని ఎన్నికల నేరంగా పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటామని, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది. జాయింట్‌ సెక్రటరీ ఫిర్యాదులను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఈసీ తెలియజేసింది. 

Updated Date - 2021-03-04T14:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising