ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్ర‌తీ దెబ్బ‌కు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు: లోకేష్

ABN, First Publish Date - 2021-06-15T13:20:17+05:30

రెండేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అరాచ‌కాలు, విధ్వంసాలే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రెండేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అరాచ‌కాలు, విధ్వంసాలే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల ఎన్నికైన గ్రామ స‌ర్పంచ్‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభిస్తామంటే, వైసీపీ మూక‌లు దాడుల‌కు తెగ‌ప‌డుతున్నాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు స‌ర్పంచ్ అనూరాధ చెరువు మ‌ర‌మ్మ‌తుల ప‌నులు ఆరంభానికి ప్ర‌య‌త్నించ‌గా, వైసీపీ నాయకులు శివ గ్యాంగ్‌ అడ్డుకున్నారని... స‌ర్పంచ్ భ‌ర్త సోమ‌శేఖ‌ర్‌, అత‌ని అనుచ‌రుల‌పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచి, అంతుచూస్తామ‌ని హెచ్చ‌రించ‌డం వైసీపీ అరాచ‌కాల‌కు అద్దం ప‌డుతోందన్నారు. గ్రామంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించిన వైసీపీ నేత‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌క‌పోవ‌డం అన్యాయమని తెలిపారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులపై ప‌డిన ప్ర‌తీ దెబ్బ‌కి మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని హెచ్చరించారు. మూడేళ్ల‌లో మూర్ఖ‌పురెడ్డి పాల‌న‌కి మూడిపోతుందన్నారు. అంద‌రి ఖాతాలు సెటిల్ చేస్తామని చెప్పారు. గ్రామంలో మ‌నుషుల్లా, మాన‌వ‌త్వంతో మెలిగితే అదే గౌర‌వం ద‌క్కుతుందని హితవుపలికారు. అధికారం అండ ఉంద‌నే అహంకారంతో అరాచ‌కాల‌కు తెగ‌బ‌డితే...రెండింత‌లు తీసుకునేందుకు సిద్ధంగా వుండండి అంటూ లోకేష్ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-15T13:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising