ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు?: రఘురామరాజు

ABN, First Publish Date - 2021-05-15T18:27:54+05:30

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ  సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే రఘురామకృష్ణం రాజుని  అరెస్ట్ చేశారని ఆరోపించారు. బెయిల్ రద్దు చెయ్యమని ఫిటిషన్ వేసినందుకు పగపట్టి కావాలని అక్రమ అరెస్ట్ చూపించారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని నిలదీశారు. ఈ అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలైనా కాపాడచ్చు కదా అని హితవుపలికారు. తమ కేసుల విచారణకు ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మంటున్నారని కక్షతో ప్రతి శుక్రవారం ఒక అక్రమ అరెస్టు చేస్తున్నారా అని విరుచుకుపడ్డారు. తమరు పెట్టే అక్రమ కేసులకు త్వరలోనే న్యాయస్థానాలు మళ్ళీ మొట్టికాయలు వేయడం ఖాయమన్నారు. తక్షణమే రఘురామ కృష్ణం రాజుపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియుల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని రఘురామరాజు హెచ్చరించారు.

Updated Date - 2021-05-15T18:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising