ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో మబ్బులు - రైతుల గుండెల్లో గుబులు

ABN, First Publish Date - 2021-11-28T06:19:38+05:30

ఆకాశంలో మబ్బులు - రైతుల గుండెల్లో గుబులు

చినఓగిరాల ఆర్‌బీకేలో ధాన్యం తేమ శాతం తెలిపే యంత్రం, పరీక్ష విధానం రైతులకు తెలియచేస్తున్న తహశీల్దార్‌, ఏవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, నవంబరు 27 :  వాతావరణ మార్పులతో ఆకాశం లో మబ్బులు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టప డి పండించిన పంట చేతి కొస్తున్న తరుణంలో అకాల వర్షాలు, వా యుగుండాలు రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. వరిపం ట కోతకొచ్చిన సమయంలో నిన్న మొన్నటి వరకు కురిసిన వర్షాలతో కోతలు ఆలస్యం కాగా పంట తరుణం మించి పోయి కంకుల నుంచి ధాన్యంరాలి పోయే పరిస్థితులతో పాటు వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో రైతులు కోతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మరలా వాయుగుండం అన్న వాతావరణ హెచ్చరికలతో శనివారం వాతావ రణ మార్పుతో ఆకాశం మేఘావృతమవ్వడం రైతులను ఆందోళనకు  గురిచేస్తుంది. వరి కోతలు కోసిపొలంలో పనలపై ఉండగా వారితో పాటు కోతలు కోయించేందుకు సిద్ధమైన వారు కూడా  వాయుగండం నుంచి తప్పించు దేవుడా అని  వేడుకుంటున్నారు. 

ఆర్‌బీకేల్లో రైతులకు కనీస మద్దతు ధర

 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కనీస మద్ధతు ధర లభిస్తుందని  ఏవో శివప్రసాద్‌, తహసీల్దార్‌ కె.నాగేశ్వరరావు అన్నారు. మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను  శనివారం సందర్శించారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 

బోర్లకింద దాళ్వా సాగు వద్దు 

ప్రస్తుత పరిస్థితుల్లో బోర్లకింద దాళ్వా సాగు ఎట్టిపరిస్థితుల్లో చేయ వద్దని అధికారులు రైతులకు సూచించారు. ప్రత్యమ్నాయంగా అపరాలు, మొక్కజొన్న సాగుచేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-11-28T06:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising