ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేద విద్వాన్‌ ఇకలేరు

ABN, First Publish Date - 2021-12-09T06:01:06+05:30

వేద విద్వాన్‌ ఇకలేరు

ధర్మపత్ని రాజ్యలక్ష్మితో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాదంలో అగ్నిహోత్రం దంపతుల దుర్మరణం

గుడివాడలో విషాదఛాయలు

40 ఏళ్లుగా హిందూధర్మ పరిరక్షణకుకృషి

వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన శ్రీనివాసాచార్యులు

150కిపైగా ఆలయాల్లో ప్రతిష్ఠాపనలు చేసిన ఘనాపాటి

ఆధ్యాత్మికత్వంలో అగ్రగణ్యుడు నేలకొరిగాడు. వేదాలను అవపోసన చేసి.. ఆగమశాస్త్రాన్ని తనలో ఇముడ్చుకున్న భక్తాగ్రేసుడు నింగి చేరాడు. ఎంతోమంది పండితులను, వేదాంతులను మనకందించిన గురుదేవుడు దేహం విడిచాడు. హిందూధర్మ పరిరక్షణే ప్రాణంగా, దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలే ధర్మంగా భావించి చివరి వరకూ శ్రీవారి సేవలో తరించిన అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు.. ప్రకాశం జిల్లా చేవూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సహధర్మచారిణి సహా  పరమపదించడంతో జిల్లా శోకతప్తమైంది. 

గుడివాడ/పెదపారుపూడి, డిసెంబరు 8 : అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు (58), రాజ్యలక్ష్మి (55) దంపతుల మృతితో ఆయన స్వగ్రామం పెదపారుపూడి మండలం జమిదింటకుర్రుతో పాటు గుడివాడలో విషాదఛాయలు అలముకున్నాయి. వేదవిద్యలో వేలాది మందిని తీర్చిదిద్దిన వేదవిద్వాన్‌ ఇక లేరన్న చేదునిజాన్ని ఆయన శిష్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆజన్మాంతం శ్రీవారి సేవలో తరించిన భక్త శిరోమణిగా పేరొందిన శ్రీనివాసాచార్యులు అయ్యప్ప భక్తుల పిలుపుపై బుధవారం ఒంగోలు వెళ్తుండగా, మార్గంమధ్యలో కారు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఆయన భార్య, డ్రైవర్‌ కూడా మరణించారు. 1985లో ద్వారకా తిరుమల వేద పాఠశాలలో అధ్యాపకుడిగా విఽధుల్లో చేరి, 2014 వరకూ పనిచేశారు. ద్వారకా తిరుమల దేవస్థానం ద్వారా ఆగమ గ్రంథాల ముద్రణ, రాతప్రతుల పరిష్కారం తదితర బాధ్యతలు నిర్వహించారు. ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర వైఖాసన ఆగమ పాఠశాలలో ప్రాయశ్చిత్త విధులతో ఆగమం, అష్టాదశ సంస్కారాలు, వైఖాసన కల్ప సూత్రం ప్రకారం  స్మార్తం తదితరాలను శిష్యులకు నేర్పారు. 2014 నుంచి  తిరుపతి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా,  డీన్‌గా సేవలందిస్తున్నారు. ఆగమశాస్త్రంపై రాష్ట్రస్థాయి సమ్మేళనాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 150కి పైగా దేవాలయాల్లో ప్రధానాచార్యులుగా ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. వైఖాసన సంప్రదాయం ప్రకారం ఎక్కడ హోమాలు జరిగినా శ్రీనివాసాచార్యులు శిష్యులు ఒక్కరైనా ఉంటారంటే అతిశయోక్తి కాదు. రామతీర్థంలో విగ్రహ ప్రతిష్ఠ, విశాఖపట్నంలో అంబికాబాగ్‌ రామాలయం శిఖర ప్రతిష్ఠ ఆయన చేతులమీదుగానే జరిగాయి. సరస్వతీ హోమం, వరుణయాగం తదితరాలు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. టీటీడీ పవిత్రోత్సవాలు, అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో రుత్విక్కుడిగా ప్రధానాచార్యులతో కలిసి విధులు నిర్వహించారు. వేదశాస్త్ర ఆగమ విద్యార్థులకు పరీక్షాధికారిగా పనిచేశారు. శ్రీనివాసాచార్యులు మృతి తనను కలచివేస్తోందని టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌ విశిష్ట ధర్మాచార్య, గుడివాడ వాసి కావూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. శ్రీనివాసాచార్యులుకు ఇద్దరు మగ పిల్లలు. రిటైర్‌ అయ్యాక జమిదింటకుర్రులో శేషజీవితం గడపాలని ఆయన అనుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ గ్రామంలోనే గురువారం శ్రీనివాసాచార్యులు దంపతుల అంతిమయాత్ర జరుగుతుంది. 





Updated Date - 2021-12-09T06:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising