ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వరుసల రహదారి

ABN, First Publish Date - 2021-10-23T06:40:24+05:30

విజయవాడ నగరంలో నవంబరు ఐదో తేదీ నుంచి పది వరుసల రహదారి అందుబాటులోకి వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ నగరంలో నవంబరు 5న సాక్షాత్కారం 

ఎన్‌హెచ్‌-65పై స్క్యూ బ్రిడ్జి నుంచి సెంటిని వరకు 

సర్వీసు రోడ్లను విస్తరిస్తేనే సౌకర్యం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగరంలో నవంబరు ఐదో తేదీ నుంచి పది వరుసల రహదారి అందుబాటులోకి వస్తోంది. వీఐపీ కారిడార్‌లోని 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై స్క్యూ బ్రిడ్జి నుంచి సెంటిని హాస్పిటల్‌ వరకు ఇది అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరుకు బెంజ్‌సర్కిల్‌ - 2 ఫ్లై ఓవర్‌ పూర్తవుతుంది. నవంబరు ఐదో తేదీకి హైవేపై అప్రోచ్‌కు అనుసంధానంగా మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి. ఆ రోజు నుంచి పది వరుసలరోడ్డు అందుబాటులోకి వస్తుంది. బెంజ్‌సర్కిల్‌-1  ఫ్లై ఓవర్‌ మూడు వరుసలను కలిగి ఉంది. దిగువన నాలుగు వరుసల రోడ్డు ఉంది. దీంతో ఇప్పటి వరకు ఏడు వరుసల మార్గం అందుబాటులో ఉంది. రెండో ఫ్లై ఓవర్‌ కూడా పూర్తి అవడంతో మరో మూడు వరసలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం కలిపి జాతీయ రహదారిపై 1.4 కిలోమీటర్ల పొడవున పది వరుసల మార్గం సిద్ధమవుతుంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్‌సర్కిల్‌కు పది వరుసల మార్గం అందాన్ని ఇచ్చినా, రెండు ఫ్లై ఓవర్ల కారణంగా సమీపంలో ఉన్న కమర్షియల్‌ భవనాలు, మల్టీప్లెక్సులు మూసుకుపోవటం ప్రతికూలంగా కనిపిస్తోంది. రెండు ఫ్లై ఓవర్లను మధ్యలోనే నిర్మించి ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. 


సర్వీసు రోడ్లను విస్తరించాలి 

బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్ల వెంబడి సర్వీసు రోడ్లను అభివృద్ధి పరిస్తే కమర్షియల్‌ భవనాలకు వన్నె తగ్గదని, మూసుకు పోయినట్టు ఉండవనే వాదనలు కూడా వినవస్తున్నాయి. రెండో ఫ్లై ఓవర్‌  పక్కన సర్వీసు రోడ్డు సమస్య లేదు. ఫ్లై ఓవర్‌ కింద మీటరున్నర వరకు రోడ్డును విస్తరిస్తారు కాబట్టి ఇంకా విశాలంగా ఉంటుంది. మొదటి ఫ్లైఓవర్‌ పక్కన మాత్రమే సర్వీసు రోడ్డు సమస్యలు వెంటాడుతున్నాయి. నోవాటెల్‌, ఎస్‌వీఎస్‌ జంక్షన్ల వద్ద భూములు ఇవ్వటానికి ఆ ప్రాంతవాసులు అంగీకరించినా, ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారుల నిర్వాకం కారణంగా సర్వీసు రోడ్డును విస్తరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్వీసు రోడ్డు సమస్యలు మరింత జఠిలమవుతాయి. ఎస్‌వీఎస్‌-జ్యోతిమహల్‌ జంక్షన్‌ దగ్గర రెండు ఫ్లైఓవర్ల రెండో పిల్లర్‌ వద్ద నూతన జంక్షన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనిని అభివృద్ది చేసినా, మొదటి వరుస సర్వీసు రోడ్డు విస్తరించకపోతే ప్రయోజనం ఉండదు.

Updated Date - 2021-10-23T06:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising