ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడి దర్శనాలు బంద్‌

ABN, First Publish Date - 2021-04-23T10:47:20+05:30

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతితో పలు ఆలయాల్లో ముందుజాగ్రత్తగా దేవుడి దర్శనాలను బంద్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి ఆలయంలో,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌) 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతితో పలు ఆలయాల్లో ముందుజాగ్రత్తగా దేవుడి దర్శనాలను బంద్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి ఆలయంలో, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి దర్శనాలు నిలిపివేయనున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఈవో కోరారు. కొవిడ్‌ లేనట్లు నిర్ధారణ అయిన తర్వాతే శ్రీశైలం రావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అరసవల్లిలో కేశఖండన శాల, ప్రసాదాల విక్రయాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా ఉండవని, స్వామివారికి నిత్యపూజలు, కళ్యాణోత్సవాలు యథావిధిగా అర్చకులు నిర్వహిస్తారని ఈవో తెలిపారు.


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని శుక్రవారం నుంచి మూసివేస్తున్నామని, నిత్య కైంకర్యాలు, పూజలు ఏకాంతంగా జరుగుతాయని ఈవో చెప్పారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సన్నిధిలో ఉచిత భోజన కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రసాద పంపిణీని కూడా నిలిపివేశారు. అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

Updated Date - 2021-04-23T10:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising