ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోండ ఉమ ఇంటికెళ్లిన కేశినేని శ్వేత

ABN, First Publish Date - 2021-03-06T22:30:44+05:30

బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీలో చిచ్చురేపుతున్నాయి. కార్పొరేటర్ సీట్ల పంపకాలు.. ఐక్యంగా ఉన్న నేతలను విడదీశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీలో చిచ్చురేపుతున్నాయి. ఐక్యంగా ఉన్న నేతలను సీట్ల పంపకాలు విడదీశాయి. బెజవాడ టీడీపీలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయారు. ఈ వ్యవహారం అంతా ఎంపీ కేశినేని నాని చుట్టే తిరుగుతోంది. నాని తీరును ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తొలుత టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ సమస్య పరిష్కారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.తిరిగి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సారి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. అధినేత జోక్యంతో వివాదం చల్లారింది. టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు... అసంతృప్తి నేతలను సముదాయించినట్టు తెలుస్తోంది. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.   



ఈ నేపథ్యంలోనే కేశినేని శ్వేత నేరుగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లారు. బొండ ఉమ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురామ్‌ కూడా ఉమ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సహకరించాలని ఆమె కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల మద్దతును శ్వేత కోరారు. శ్వేతనే నేరుగా ఈ ముగ్గురు నేతలను స్వయంగా కలవడంతో సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొదటి నుంచి శ్వేత మేయర్ అభ్యర్థిత్వంపై బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-03-06T22:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising