ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులు చేస్తున్న ఏకైక రాష్ర్టం ఏపీనే: కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2021-08-08T22:31:44+05:30

అప్పులు చేస్తున్న ఏకైక రాష్ర్టం ఏపీనే: కళా వెంకట్రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ 2 ఏళ్ల పాలనంతా తప్పులు, అప్పులు చేస్తూ... ప్రజలను తిప్పలుపెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. అప్పులు తెచ్చి అవినీతి, దుబారా చేసి సంక్షేమ పధకాల కోసం అప్పులు తెచ్చామని అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయటం సిగ్గుచేటన్నారు. అమెరికాను కొలంబస్ కనుగొన్నట్లు సంక్షేమాన్ని వైసీపీ నేతలే కనుగొన్నట్టు  ప్రచారం  చేసుకుంటున్నారని విమర్శించారు. ఇంతకు ముందు సంక్షేమ పధకాలు ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో అధికంగా అప్పులు చేస్తున్న ఏకైక రాష్ర్టం మన ఏపీనే అన్నారు. టీడీపీ ప్రభుత్వం 60 నెలల్లో రూ. 1,30,146.98 కోట్లు అప్పు చేస్తే, వైసీపీ ప్రభుత్వం 25 నెలల్లోనే రూ. 1,49,212.11 కోట్లు అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4 శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధన కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించి అప్పులు చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సకాలానికి జీతాలివ్వకుండా వారి కుటుంబాల్ని పస్తులుంచుతోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈనెల జీతాల కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. పింఛన్‌దారులు సైతం పూర్తిగా పెన్షన్‌ అందక బ్యాంకు ఖాతాల ఎస్ఎంఎస్ల కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాల కోసం, వృద్దుల పించన్ల కోసం సైతం నెల నెలా బ్యాంకుల దగ్గర, కేంద్రం దగ్గర చేయిచాచి అప్పు అడ్డుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - 2021-08-08T22:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising