ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా సాయిబాబా గుడి రస్తా

ABN, First Publish Date - 2021-10-13T05:30:00+05:30

ఎర్రగుంట్ల నాలుగురోడ్ల నుంచి సాయిబాబా గుడికి వెళ్లే రస్తాను పట్టించుకునే వారే కరువయ్యారు.

నడిరోడ్డుపై వేసిన మట్టికుప్పలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, అక్టోబరు 13: ఎర్రగుంట్ల నాలుగురోడ్ల నుంచి సాయిబాబా గుడికి వెళ్లే రస్తాను పట్టించుకునే వారే కరువయ్యారు. 4, 5 కౌన్సిల్‌ వార్డులకు ఇదే ప్రధాన దారి. ఈ రస్తా నరకప్రాయంగా మారింది. రోడ్డులో ఎక్కడ చూసినా గుంతలే. దీనికి తోడు వృథా నీరు, కొన్ని చోట్ల డ్రైనేజి నీరు రోడ్డుపైకి వస్తోంది. కొన్ని చోట్ల వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో రస్తాలో ఎక్కడ చూసినా బురద కనిపిస్తోంది. ఇళ్ల ముంగిట నీరు ఆగకుండా కొందరు ఇప్పటికే సీసీ రోడ్డుపై మట్టివేసి ఎత్తుచేసుకున్నారు. దీంతో సీసీ రోడ్డు కనిపించకుండా పోయింది. మంగళవారం  ట్రాక్టర్‌తో తెచ్చి మట్టికుప్పలు నడిరోడ్డుపై వేశారు. దీంతో ఈరో డ్డు పాదచారులకు, ద్విచక్రవాహన చోదకులకు మరింత అధ్వానంగా మారింది. ఈరోడ్డుకు డ్రైనేజీ నిర్మించి, కొత్త రోడ్డ వేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.  సచివాలయ సిబ్బందికి, నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు.  

Updated Date - 2021-10-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising