ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ నగరంగా కడపను తీర్చిదిద్దుతాం

ABN, First Publish Date - 2021-12-06T05:20:53+05:30

నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, నగర మేయర్‌ సురే్‌షబాబులు సంయుక్తంగా పేర్కొన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నినాదంలో భాగంగా ఆదివారం నగరంలోని 25వ డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా మూడు రంగుల చెత్త కుండీల (డస్ట్‌బిన్‌)లను వారు పంపిణీ చేశారు.

డస్ట్‌బిన్స్‌ పంపిణీ చేస్తున్న అంజద్‌బాషా, మేయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 5: నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, నగర మేయర్‌ సురే్‌షబాబులు సంయుక్తంగా పేర్కొన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నినాదంలో భాగంగా ఆదివారం నగరంలోని 25వ డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా మూడు రంగుల చెత్త కుండీల (డస్ట్‌బిన్‌)లను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి  మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో కడపను స్వచ్ఛ నగరంగా రాష్ట్రానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేయడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, అందుకోసం కోట్లాది రూపాయల నిధులను కూడా అందిస్తున్నారన్నారు. మేయర్‌ సురే్‌షబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలను ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ రంగస్వామి, స్థానిక డివిజన్‌ కార్పొరేటర్లు, మున్సిపల్‌ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం 

పేదలకు నిత్యావసర సరుకులను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు రావడం అభినందనీయమని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా అన్నారు. నగర పరిధిలో నివాసముంటున్న పేదలకు ఏఆర్‌ రెహమాన్‌ ఇందాద్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T05:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising