ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ వెంట మేమున్నాం

ABN, First Publish Date - 2021-01-26T05:44:44+05:30

మీ వెంట మేమున్నామని జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలవాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డిలు తెలిపారు. వారు సోమవారం పంచాయతీ ఎన్నికల నామినేషన కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.

నాగులగుట్టపల్లెలో కార్యకర్తలతో మాట్లాడుతున్న బీటెక్‌ రవి, లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల్లో పోటీ చేయండి

కార్యకర్తలతో బీటెక్‌ రవి, లింగారెడ్డి

చక్రాయపేట, జనవరి 25: మీ వెంట మేమున్నామని జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలవాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డిలు తెలిపారు. వారు సోమవారం పంచాయతీ ఎన్నికల నామినేషన కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చక్రాయపేట గ్రామానికి నామినేషన వేసేందుకు ఎంపీడీఓను కలిశారు. ఎంపీడీవో హైదర్‌అలీ నామినేషనకు సంబంధించిన అధికారులు రాలేదని, అందుకు సంబంధించిన పత్రాలు రాలేదని, అంతేకాకుండా జిల్లా అధికారులు తమకు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. అందుకు స్పందించిన బీటెక్‌ రవి, లింగారెడ్డిలు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలకకుండా, రాజకీయాలు చేయకుండా ఎన్నికల అధికారి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరారు. అనంతరం నాగులగుట్టపల్లె మహేశ్వరరెడ్డి ఇంట్లో కార్యకర్తలనుద్దేశించి వారు మాట్లాడుతూ జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి పోటీచేయాలని ఎవరూ భయపడవద్దని, మీవెంట మేమున్నామని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మీరేమో చెప్పి వెళ్లిపోతారు.. మాకు ఇక్కడ సమస్యలు వస్తే ఎవరూ ఉండరని మదనపడ్డారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఏ సమస్య వచ్చిన మేము ముందుంటామని వారు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో కర్ణాటి నాగభూషణంరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, పట్టెం అశోక్‌, ఎద్దుల చంద్ర, భాస్కర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T05:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising