ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మద్‌ ప్రవక ్త బాటలో నడవాలి

ABN, First Publish Date - 2021-10-20T05:21:28+05:30

మహ్మద్‌ ప్రవక్త చూపిన బాటలో నడవాలని జమ్మలమడుగు గౌషియా పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి సూచించారు.

జమ్మలమడుగులో మిలాదున్‌నబీ పురస్కరించుకుని ముస్లింల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 19 : మహ్మద్‌ ప్రవక్త చూపిన బాటలో నడవాలని జమ్మలమడుగు గౌషియా పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి సూచించారు. మంగళవారం మిలాదున్‌ నబీ పండుగను పురస్కరించుకుని గౌషియా షాదీఖానా వద్ద నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లింలు పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదు పీఠాధిపతి షాదిక్‌పాషాఖాద్రి ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గాంధీ విగ్రహం, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక ్త సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గౌషియా పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. గౌషియా మకాన్‌లో అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం మహమ్మద్‌ ప్రవక్త జ్ఞాపికల ప్రదర్శనను పురస్కరించుకుని జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

 

Updated Date - 2021-10-20T05:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising