ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన చానెల్‌ ద్వారా జిల్లాకు చేరిన ఆక్సిజన ట్యాంకర్‌

ABN, First Publish Date - 2021-05-14T05:36:38+05:30

కర్నాటక రాష్ట్రం తోరణగల్లు జిందాల్‌ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన ట్యాకర్‌ను పోలీసుల ఎస్కార్టుతో గ్రీన చానెల్‌ ద్వారా గురువారం సాయంత్రం కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు.

పోలీస్‌ ఎస్కార్ట్‌తో వస్తున్న ఆక్సిజన ట్యాంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక చొరవచూపిన ఎస్పీ 

కడప(క్రైం), మే 13: కర్నాటక రాష్ట్రం తోరణగల్లు జిందాల్‌ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన ట్యాకర్‌ను పోలీసుల ఎస్కార్టుతో గ్రీన చానెల్‌ ద్వారా గురువారం సాయంత్రం కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. మార్గమధ్యంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఆలస్యం కాకుండా పోలీసులు సహకారం అందించారు. దాదాపు 300 కి.మీ దూరం ఉన్న తోరణగల్లు నుంచి కడప చేరుకోవాలంటే 9గంటలకు పైగా సమయం పడుతుంది. అలాంటిది ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తూ కేవలం ఆరు గంటల్లోనే జిల్లా పోలీసులు ట్యాంకర్‌ వెంటే ఉంటూ కడపకు చేర్చారు. సాయంత్రం 5గంటలకే ఆసుపత్రికి చేరడంతో ఇటు కోవిడ్‌ పేషంట్లు, వారి సహాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ కేకేఎన అన్బురాజన ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిరోజూ రావాల్సిన ఆక్సిజన నిల్వల వాటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బారికేడ్‌లను తొలగించడం ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా ట్యాంకరు వచ్చేందుకు ఎస్పీ తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి.

Updated Date - 2021-05-14T05:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising