ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-06-18T04:55:01+05:30

రాష్ట్రంలో వ్యాక్సినే షన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల ని టీడీపీ నేతలు నిరసనలు తెలిపి తహసీల్దార్లకు వినతి పత్రాలు సమ ర్పించారు.

వేంపల్లెలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో రోజు నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించిన టీడీపీ నేతలు

వేంపల్లె, జూన 17: రాష్ట్రంలో వ్యాక్సినే షన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల ని టీడీపీ నేతలు నిరసనలు తెలిపి తహసీల్దార్లకు వినతి పత్రాలు సమ ర్పించారు. ఇందులో భాగంగా వేంపల్లె డిప్యూటీ తహసీల్దారు వీరశేఖర్‌కు వినతి పత్రం సమర్పించిన టీడీపీ మండల నేతలు కృష్ణారెడ్డి, పురుషోత్త మరెడ్డి మాట్లాడుతూ

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన మరణాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ ఆర్థికప్యాకేజీ ప్రకటించిందన్నారు. రైతు లను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తుల ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అన్నా క్యాంటీన్లు తెరవాలని డిమాండ్‌ చేశారు. 

వేములలో...

వేముల, జూన 17: కరోనా వ్యాక్సినేషన ప్రక్రి యను వేగవంతం చేయాలని తహసీల్దార్‌ నరసింహులుకు టీడీపీ నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేంద్రం రాష్ట్రానికి 65లక్షల డోసుల వ్యాక్సిన ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 26లక్షల డోసులనే పంపిణీ చేసిందన్నారు. మొదటి, రెం డో డోస్‌ కోసం లక్షలాదిమంది ఎదు రుచూస్తు న్నారని, కరోనా నివారణకు వ్యాక్సిన పంపిణీని వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారిశుధ్య కార్మి కుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాం డ్‌ చేశారు. ఆనందయ్య మందు తయారీకి అవసరమైన సామగ్రిని ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో మండల టీడీపీ ఇనచార్జి బ్రహ్మయ్య, చిన్నఅంకిరెడ్డి, సత్యమారెడ్డి, ఓబుళరెడ్డి యాద వ్‌, చంటి, చిన్న హనుమంతు రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising