ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

ABN, First Publish Date - 2021-03-01T04:47:14+05:30

ప్రభుత్వం పంచాయతీల్లో చెత్తను సేకరించి ఆ చెత్త ద్వారా పంచాయతీని అభివృద్ధి పరిచేందుకు నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.

పుత్తనవారిపల్లె వద్ద రోడ్డు పక్కనే వేస్తున్న చెత్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు పక్కనే పేరుకుపోతున్న చెత్త

పుల్లంపేట, ఫిబ్రవరి28 : ప్రభుత్వం పంచాయతీల్లో చెత్తను సేకరించి ఆ చెత్త ద్వారా పంచాయతీని అభివృద్ధి పరిచేందుకు నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రతి పంచాయతీలో లక్షలు వ్యయం చేసి నిర్మించిన ఈ చెత్త సంపద కేంద్రాలు పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయి. పంచాయతీలో సేకరించిన చెత్తను చెత్తసంపద కేంద్రాల్లో కాకుండా రోడ్డు పక్కనే వేస్తున్నారు. దీంతో చెత్త సంపద కేంద్రాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడింది. పుల్లంపేట మండలంలో అన్ని పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించారు. ప్రస్తుతం అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పుత్తనవారిపల్లె పంచాయతీలో సేకరించిన చెత్తను హైవే రోడ్డు పక్కనే వేస్తున్నారు. రోజురోజుకు రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోతోంది. చెత్త సంపద కేంద్రాలు మాత్రం పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు వినియోగంలోకి రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. 



Updated Date - 2021-03-01T04:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising