ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువ రైతుకు ఉగాది పురస్కారం

ABN, First Publish Date - 2021-04-14T05:44:00+05:30

కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండల పరిధిలోని లింగాయపల్లెకు చెందిన యువ రైతు మాధవరెడ్డి రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని అందుకున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు.

అవార్డు అందుకున్న రైతు మాధవరెడ్డి (ఎడమ నుంచి ఆరో వ్యక్తి)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, ఏప్రిల్‌ 13 : కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండల పరిధిలోని లింగాయపల్లెకు చెందిన యువ రైతు మాధవరెడ్డి రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని అందుకున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. అమరావతిలో మంగళవారం పురస్కారాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞానకేంద్రం, ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా వివిధ పంటల్లో అనేక రకాలు పండించడంతో పాటు ఆ రకాలను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అధిక దిగుబడినిచ్చే అలసంద రకం పీపీటీ-29ని జిల్లావ్యాప్తంగా రైతులకు చేరువ కావడంలో మాధవరెడ్డి పాత్ర కీలకమన్నారు. తాను అవలంభించిన పద్ధతులు తన చుట్టూ ఉన్న రైతులకు పరిచయం చేసి నిరంతరం రైతుల మేలు, అభివృద్ధి కోసం కృషి చేసిన మాధవరెడ్డికి ఈ పురస్కారం రావడం పట్ల తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురికి అవార్డు రాగా అందులో మన జిల్లా వాసి ఉండటం గర్వకారణమన్నారు. మున్ముందు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్‌ బి.పద్మోదయ, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రిక, సిబ్బంది అభినందనలు తెలిపారు.


Updated Date - 2021-04-14T05:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising