ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇరువురు దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2021-12-09T04:52:59+05:30

జిల్లాలోని పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను చిన్నచౌకు పోలీసులు తాడిపత్రి-తిరుపతి బైపా్‌సరోడ్డులోని దేవునికడప ఆర్చీ వద్ద అరెస్టు చేశారు. కడప డీఎస్పీ కార్యాలయంలో బుధవారం కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిన్నచౌక్‌ ఎస్‌ఐ అమర్‌నాధ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.25 వేలు నగదు, బ్యాటరీ స్వాధీనం 

కడప(క్రైం), డిసెంబరు 8: జిల్లాలోని పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను చిన్నచౌకు పోలీసులు తాడిపత్రి-తిరుపతి బైపా్‌సరోడ్డులోని దేవునికడప ఆర్చీ వద్ద అరెస్టు చేశారు. కడప డీఎస్పీ కార్యాలయంలో బుధవారం కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిన్నచౌక్‌ ఎస్‌ఐ అమర్‌నాధ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. కడప నగరం అశోక్‌నగర్‌కు చెందిన బుక్కే సతీ్‌షనాయక్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అలాగే చిన్నచౌక్‌ ఎస్టీ కాలనీకి చెందిన వాగాల కార్తీక్‌ ప్రస్తుతం రామాంజనేయపురంలోని వరద కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరిరువురు కలిసి రాత్రిళ్లు తిరుగుతూ దేవాలయాల్లోని హుండీల నగదు చోరీలకు పాల్పడుతూ వస్తున్నారు. చిన్నచౌక్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ప్రొక్లైన్‌ సంబంధించి బ్యాటరీ చోరీ చేశారని, అలాగే కడప తాలూకా పోలీసు స్టేషన్‌, రిమ్స్‌ స్టేషన్లతో పాటు పలు పలు చోట్ల హుండీల చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అమర్‌నాధ్‌రెడ్డి, సిబ్బంది ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.25 వేలు నగదు, జేసీబీ వాహనానికి సంబంధించి బ్యాటరీని రికవరీ చేసి ఈ మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-12-09T04:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising