ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షం లేని సభను ప్రజాపక్ష సభగా మార్చండి

ABN, First Publish Date - 2021-12-16T04:49:52+05:30

ప్రతిపక్షం లేని మం డల సర్వసభ్య సమాశ సభను ప్రజాపక్ష సభగా మార్చి ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే  

 

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 15: ప్రతిపక్షం లేని మం డల సర్వసభ్య సమాశ సభను ప్రజాపక్ష సభగా మార్చి ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోగల ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో బుధవారం తొలి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సానబోయిన శేఖర్‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో తొలుత పాలకవర్గంచే పరిచయాలు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యు త్తు స్తంభాలు, తీగెలపై ఒకపైలెట్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాటిని సరిదిద్దే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు తమ పరిధిలోని విద్యుత్తు సమస్యలపై దృష్టి సారించి సభ దృష్టికి తేవాలన్నారు. అనంతరం పాలకవర్గ సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలపై స్వరం వినిపించారు. అలాగే అన్ని శాఖల అధికారులు తమ శాఖల ప్రగతిపై సభకు వివరించారు.  కార్యక్రమంలో ఆప్కాబ్‌రాష్ట్ర చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ శారదమ్మ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దారు నజీర్‌ అహమ్మద్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T04:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising