మాస్కులకు తిలోదకాలు
ABN, First Publish Date - 2021-10-30T05:00:10+05:30
కొవిడ్ దాటిపోయిందని అ నుకుంటూ ప్రజలు మాస్క్‌లకు తిలోదకాలు ఇస్తున్నారు. వ్యాక్సి న్ వేయించుకున్నాం మాకేం కాదని భ్రమపడుతూ తిరుగు తున్నా అధికారులు కఠిన ఆంక్ష లు అమలు చేయడంలో విఫ లం చెందారనే ఆరోపణలున్నా యి.
చాపకింద నీరులా కొవిడ్
పెరుగుతున్న కేసులు
కఠిన నిబంధనలేవీ?
పులివెందుల రూరల్, అక్టోబరు 29: కొవిడ్ దాటిపోయిందని అ నుకుంటూ ప్రజలు మాస్క్‌లకు తిలోదకాలు ఇస్తున్నారు. వ్యాక్సి న్ వేయించుకున్నాం మాకేం కాదని భ్రమపడుతూ తిరుగు తున్నా అధికారులు కఠిన ఆంక్ష లు అమలు చేయడంలో విఫ లం చెందారనే ఆరోపణలున్నా యి. నిబంధనలు పాటించడం తోనే కొవిడ్ వ్యాప్తిని అరికట్టవ చ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మరోలా జరు గుతోంది. కేవలం వ్యాక్సినేషన్ పూర్తయ్యేం దుకు అధికారులు కసరత్తు చేస్తున్నారే తప్ప నిబంధనల అమలుపై దృష్టి సారిం చడం లేదన్నది నగ్న సత్యం. కాగా మా స్కులు ఉపయోగించని వారికి జరిమానా లు విధించాలని ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించినా ఆ దిశగా పనులు జరగడంలేదనే ఆరోపణలున్నాయి.
సంబంధిత సిబ్బంది అసలు మాస్కే ధరించ కుండా విధులకు హాజరవు తుండ డం గమనార్హం. ఈనిర్లక్ష్యంతో పలువురు ప్రజలు కొవిడ్ బారిన మళ్లీమళ్లీ పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు పులివెందుల మండ లం నల్లపు రెడ్డిపల్లె పీహెచ్‌సీ పరిధిలో (మున్సిపాలిటీ, గ్రామా లు) వ్యాక్సినేషన్ కోసం దాదాపు 62 వేల మందిని వైద్యసిబ్బంది గుర్తించారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి అక్టోబరు 29వ తేదీ వరకు మొదటి, రెం డో డోస్‌లు కలిపి 87314 డోస్‌లు ప్రజ లకు అందించారు. ఇంకా సుమారు 19వేల మందికి మొదటి, రెండో డోస్‌లు వేయాల్సి ఉన్నట్లు వైద్యాధికారులు చెబు తున్నారు. వ్యాక్సిన్ సచివాలయాల్లో అందుబాటులో ఉన్నా అవి దుర్వినియో గం అవుతున్నాయనే విమర్శలున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం నల్లపురె డ్డిపల్లె అక్టోబరులో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉన్నట్లు ప్రైవేటు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకున్న వారే. కాగా 15రోజుల్లో దాదాపు 30 మందికి కొవిడ్ సోకినట్లు సమాచారం. ఈ వారంలో ఒకేఇంట్లో దాదాపు 8మందికి, మరో ఇంట్లో నలుగురికి కొవిడ్ సోకినట్లు విశ్వసనీయ సమాచా రం. వీరంతా వ్యాక్సిన్ వేసుకుని నిబంధనలు పాటించకపోవడంతోనే కొవిడ్ సోకినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరు వ్యాపారులు కావడంతో అక్కడికి వెళ్లిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, పెద్ద దుకాణాలు, జనావాసాలు, రాజకీయ ప్రసంగాల వద్ద నిబంధనలు తూట్లు పడుతున్నాయి.
ముందే జాగ్రత్తలు తీసుకోవాలి
కొవిడ్ రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్ బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా బ్రీతింగ్ వ్యాయామం వలన ఊపిరితిత్తుల్లో నెమ్ముచేరకుం డా ఉంటుంది. బాడీ ఎక్సర్‌సైజ్ చేయాలి. బయట కు వెళ్లి నప్పుడు నిబంధనలు పాటించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. లక్షణాలు గుర్తించినా నిర్లక్ష్యం వలన కొవిడ్ మళ్లీ విజృంభించే అవకాశం ఉంది.
మధుసూదన్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఏరియా ఆస్పత్రి, పులివెందుల
Updated Date - 2021-10-30T05:00:10+05:30 IST