ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిరీష హత్య కేసులో ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2021-06-20T04:50:17+05:30

బదే ్వలులో శిరీష అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు చరణ్‌తో పాటు అతనికి సహకరించిన గొడుగునూ రు నాయబ్‌రసూల్‌, పేరుసోమల నరసింహలు ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 మీడియా సమావేశంలో ఎస్పీ అన్బురాజన్‌

కడప (క్రైం), జూన్‌ 19 : బదే ్వలులో శిరీష అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు చరణ్‌తో పాటు అతనికి సహకరించిన గొడుగునూ రు నాయబ్‌రసూల్‌, పేరుసోమల నరసింహలు ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం వ్యవసాయ పనుల్లో ఉన్న తన తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తున్న శిరీష (19) అనే యువతిని తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని నిందితుడు బాలరాజు చరణ్‌ వేధించాడన్నారు. తల్లిదండ్రులను వ్యతిరేకించి తాను ప్రేమించలేనని శిరీష చెప్పడంతో ఆమెపై ఆగ్రహించి కొడవలితో  నరికాడన్నారు. దీంతో గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. అనంతరం పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు, మరో ఇద్దరు గొడుగునూరు నాయబ్‌ రసూల్‌, పేరుసోమల నరసింహ అనే వారు సహకరించినట్లు వెల్లడైందన్నా రు. కాగా శిరీష తన తల్లిదండ్రులకు రెండో సంతానమని, బద్వేలు వీరారెడ్డికాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా కొన్ని నెలలుగా బాలరాజు చరణ్‌ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించేవాడన్నారు. ఈ విషయాన్ని ఐదారు నెలల క్రితమే శిరీష తన చెల్లెలు సుష్మితకు చెప్పిందన్నారు. ఇటీవల కాలేజీలు మూసివేయడంతో చరణ్‌  తన స్నేహితుల సాయంతో శిరీష దినచర్య తెలుసుకుని ఆమె పత్తి చేను వద్ద ఉండగా ఆమె వద్దకు పోయి  తాను తెచ్చుకున్న కత్తితో దాడి చేశారన్నారు. ఈ సంఘటనలో శిరీష మరణించిందన్నారు. కేసు నమోదు చేసుకుని చరణ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఇటీవల కడప నగరంలో ఓ యువతిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆ నిందితున్ని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎవరైనా, ఎక్కడైనా మానసిక, శారీరక హింసకు గురైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు. అలాగే ఎస్పీ ఫోన్‌ నెం.9440796900కు ఫిర్యాదు చేయాలన్నారు.

Updated Date - 2021-06-20T04:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising