ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక కొరత రాకూడదు : జేసీ

ABN, First Publish Date - 2021-06-24T04:59:53+05:30

పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్య లు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు.

మాట్లాడుతున్న జేసీలు ఎం.గౌతమి, ధ్యాన్‌చంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌) జూన్‌ 23. పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్య లు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో జేసీ ధ్యాన్‌చంద్ర, గనులు, భూగర్భ శాఖాధికారులు, జిల్లా ఇసుక అధికారులు, జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా సరఫరా చేసేందుకు జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా 5 లక్షల టన్నుల ఇసుకను డిపోలలో సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం జేసీ ధ్యాన్‌చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన లేఔట్ల నుంచి 40 కిలోమీటర్ల లోపు ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లబ్ధిదారులే ఇసుకను తెచ్చుకోవాలన్నారు. 40 కిలోమీటర్లు మించి దూరంగా ఉంటే కంపెనీ వారు లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఇసుక సరఫరా చేయాలన్నారు.

Updated Date - 2021-06-24T04:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising