ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు నెక్లెస్‌ పోగొట్టుకున్న మహిళ

ABN, First Publish Date - 2021-10-18T05:07:13+05:30

కడప నగరానికి పనినిమిత్తం వచ్చిన మహిళ బంగారు నెక్లెస్‌ పోగొట్టుకుంది. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ పోలీసులు అప్రమత్తమై బాధితురాలికి అందజేశారు. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షణాల్లో అందజేసిన కమాండ్‌ కంట్రోల్‌ పోలీసులు

కడప(క్రైం), అక్టోబరు 17: కడప నగరానికి పనినిమిత్తం వచ్చిన మహిళ బంగారు నెక్లెస్‌ పోగొట్టుకుంది. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ పోలీసులు అప్రమత్తమై బాధితురాలికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం నూకలపల్లికి చెందిన ఓబులమ్మ అనే మహిళ ఆదివారం కడప నగరానికి వచ్చి ఆటోలో తిరిగి వెళుతుండగా చెన్నూరు బస్‌స్టాప్‌ వద్ద హ్యాండ్‌ బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఈ విషయమై వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెంటనే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బందిని సీఐ అప్రమత్తం చేశారు. చెన్నూరు బస్‌స్టాండ్‌ మార్గంలో సీసీ కెమెరాల ఫుటేజీని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వీడియో వాల్‌లో పోలీసులు పరిశీలించారు. తాజుద్దీన్‌ అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ ఆటోలో నుంచి కింద పడ్డ హ్యాండ్‌ బ్యాగ్‌ను గుర్తించి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించేందుకు సిద్ధమై ఉండగా కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది వెళ్లి హ్యాండ్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్నారు. తక్షణమే స్పందించి రూ.1.5 లక్షల విలువైన నెక్లెస్‌ ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అందించేందుకు కృషి చేసిన కడప వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ రాజారెడ్డి, సిబ్బంది కానిస్టేబుల్‌ రాయుడు, వీడియోవాల్‌ అపరేటర్‌ కానిస్టేబుల్‌ రమే్‌షలను ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు. 


Updated Date - 2021-10-18T05:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising