ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను పెంపు జీవోను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-06-21T05:30:00+05:30

కరోనా కష్టకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని, ఆ జీవోను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌.నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్‌, లోక్‌సత్తా జిల్లా నాయకులు శ్రీకృష్ణదేవర పేర్కొన్నారు.

కార్పొరేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న అఖిలపక్షం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

కడప(రవీంద్రనగర్‌), జూన్‌ 21: కరోనా కష్టకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని, ఆ జీవోను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌.నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్‌, లోక్‌సత్తా జిల్లా నాయకులు శ్రీకృష్ణదేవర పేర్కొన్నారు. సోమవారం కడప కార్పొరేషన్‌ వద్ద పన్నుల పెంపునకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోలు, డీజలు ధరల వల్ల అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి జనజీవనం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో పట్టణ, నగర ప్రజానీకంపై పన్నుల భారం మోపడం సిగ్గుచేటన్నారు. వెంటనే పెంచిన పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సుధాకర్‌, వేణుగోపాల్‌, బాదుల్లా, నాగరాజు, చెంచయ్య, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising