ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండవ ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-04-21T05:03:59+05:30

గ్రామీణ ప్రాంతల్లో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ రెండవ ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట 48 గంటల నిరాహారదీక్షలో కూర్చున్న కాంట్రాక్ట్‌ రెండవ ఏఎన్‌ఎంలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌

రెండో రోజూ కొనసాగిన 48 గంటల నిరాహారదీక్ష


కడప(రవీంద్రనగర్‌), ఏప్రిల్‌ 20: గ్రామీణ ప్రాంతల్లో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ రెండవ ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఎన్‌ఎంలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 48 గంటల నిరాహారదీక్ష మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రామమోహన్‌ మాట్లాడుతూ న్యాయమైన ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘ నాయకుడు ఓబులేశు మాట్లాడుతూ ఏళ్లతరబడి తక్కువ జీతానికి సేవలు అందిస్తున్న ఏఎన్‌ఎంల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. ధర్నాలో ఏపీ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ 2వ ఏఎన్‌ఎంల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ, ఆశావర్కర్ప్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంధం రాజమణి, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఫార్మసి్‌స్టల సంఘం జిల్లా నాయకులు జగదీష్‌, సుభాషిణి, ప్రశాంతి, దేవమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising