ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల కోసం నిరుద్యోగుల గర్జన

ABN, First Publish Date - 2021-06-24T05:02:36+05:30

ప్రొద్దుటూరులో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం గర్జించారు. సీఎంగా జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు ప్రతి ఏడాది కేలండర్‌ ప్రకటించి ఏటా 6500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా దగా చేశారని ఏపీ నిరుద్యోగ సమితి నేతలు శివ, ఓబులేసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 23: ప్రొద్దుటూరులో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం గర్జించారు. సీఎంగా జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు ప్రతి ఏడాది కేలండర్‌ ప్రకటించి ఏటా 6500 మందికి  ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా దగా చేశారని ఏపీ నిరుద్యోగ సమితి నేతలు శివ, ఓబులేసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులు గాంధీరోడ్డు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయం ఎదు ట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా  కేలండర్‌ను పునఃసమీక్షించాలని, గ్రూప్‌-1,2లతో సహా ఉపాధ్యాయ, పోలీసు కొలువులు వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో డిమాండ్‌ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన లాంటి పథకాలు పెట్టి విద్యావకాశాలు కల్పించారని.. అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను రోడ్లపాలు చేస్తున్నారన్నారు. పట్టాలు పుచ్చుకొని కొలువుల కోసం ఏళ్ల తరబడి  ఎదురు చూస్తున్న సందర్భంలో సీఎం ప్రకటించిన కేలండర్‌ చూసి కళ్ళల్లో కన్నీటి బదులు రక్తం కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేలండర్‌ను పునఃసమీక్షించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2021-06-24T05:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising