ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుకే అసహ్యమేసేలా..!

ABN, First Publish Date - 2021-05-06T05:13:41+05:30

కడప నగరం 25వ డివిజన్‌ కోఆపరేటివ్‌ కాలనీలో రోడ్లకిరువైపులా చెత్త తిష్ట వేసింది. రోడ్డుకే అసహ్యమేసేలా, చూసే వారికి రోత పుట్టేలా ఉంది. ప్రధాన రహదారిపైనే ఇలా ఉండడంతో స్థానికులు కంపు భరించలేకున్నారు.

కో ఆపరేటివ్‌ కాలనీలో పేరుకుపోయిన చెత్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్లకిరువైపులా చెత్త

కాల్వల్లో పేరుకుపోయిన మురుగు

ఇదీ కోఆపరేటివ్‌ కాలనీలోని దుస్థితి

కడప(ఎర్రముక్కపల్లె), మే 5: కడప నగరం 25వ డివిజన్‌ కోఆపరేటివ్‌ కాలనీలో రోడ్లకిరువైపులా చెత్త తిష్ట వేసింది. రోడ్డుకే అసహ్యమేసేలా, చూసే వారికి రోత పుట్టేలా ఉంది. ప్రధాన రహదారిపైనే ఇలా ఉండడంతో స్థానికులు కంపు భరించలేకున్నారు. పైగా ఈ చెత్త కుళ్లి దోమలు వృద్ధి చెంది రేయింబవళ్లు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలకు నిద్ర కరువవుతోంది. వారాల తరబడి శుభ్రం చేయకపోవడం వల్లనే ఈ విధంగా తయారైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య అధికారులు, పాలకులకు తెలిసినా పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. పారిశుధ్య కార్మికులు ప్రధాన రోడ్లకు మాత్రమే పరిమితమని, వీధుల్లోకి రారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు తక్షణం స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-06T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising