ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి పాలన విధించాలి

ABN, First Publish Date - 2021-10-26T05:58:52+05:30

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి డిమాండ్‌ చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి

కడప, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తాడేపల్లె పాలె్‌సలో ఓ పాలేరు ఉన్నారంటూ బోసిడీకే పదాన్ని వాడితే దానిని ముఖ్యమంత్రి జగన తనకు అన్వయించుకొని ఎక్కడా లేని పదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఎమ్మెల్యే రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్దస్త్‌ కామెడీ షోలో అప్పారావు భాస్కర్‌ను బోసిడీకే అంటూ సంబోధిస్తారని, ఆ వ్యాఖ్యకు రోజా పగలబడి నవ్వారని మరెందుకు ఆమెను జగన సస్పెండ్‌ చేయలేదంటూ ప్రశ్నించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబును సీనియర్‌ అన్న గౌరవం కూడా లేకుండా మంత్రి కొడాలి నానితో పాటు పలువురు దూషిస్తే జగన ఎందుకు స్పందించలేదన్నారు. తన అభిమానులు బీపీ వచ్చే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని జగన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్ల పార్టీకే బీపీ వస్తే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ అభిమానులకు బీపీ వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. చేతకాకనే టీడీపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మంత్రి నాని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకగ్రీవం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేసిన విషయం నాని మరిచారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాఽధి హామీ నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి పనులు చేయకుండానే రూ.5 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. కడప అసెంబ్లీ ఇనచార్జ్‌ అమీర్‌బాబు, కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి జయకుమార్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising