ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన గర్హనీయం

ABN, First Publish Date - 2021-01-27T05:16:40+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం గర్హనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వికేంద్రీకరణ చట్టం కేసు హైకోర్టు విచారణలో ఉండగా ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ తన ప్రసంగంలో మూ డు రాజధానుల ప్రస్తావన తేవడం అసమంజసమన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తాననడం హా స్యాస్పదమన్నారు. ఒకవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఒక రాష్ట్రం, ఒకే రాజధాని అది అమ రావతే అని నినదిస్తున్నారన్నారు. 400రోజులకు పైబడి రా జధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గాంధేయపద్ధతిలో ఉద్య మిస్తున్నారన్నారు. నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు తోనైనా జగన్‌ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగకపోవడం శోచనీయమన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం హింసాత్మకంగా మారడం దురదృష్టకర మన్నారు. రాహుల్‌గాంధీ చెప్పినట్లు హింస సమ స్యలకు పరిష్కారం కాదు, మహాత్ముని అహింసా మార్గమే సమస్యలకు పరిష్కారమన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంతానికి పోకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్నారు.  

Updated Date - 2021-01-27T05:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising