టీడీపీ నేతల గృహ నిర్బంధం అమానుషం
ABN, First Publish Date - 2021-10-22T05:09:16+05:30
టీడీపీ జాతీయ కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిని వదిలేసి శాంతీయుతంగా నిరసన తెలిపే వారిని గృహనిర్బంధం చేయడం అమానుషమని పోలీ సుల తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్ మండిపడ్డారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్
కడప, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిని వదిలేసి శాంతీయుతంగా నిరసన తెలిపే వారిని గృహనిర్బంధం చేయడం అమానుషమని పోలీ సుల తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్ మండిపడ్డారు. ఆయన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. యువతను డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుం డా ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయడం ఏమిటన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఒకప్పుడు పోలీసులకు ప్రజలు సెల్యూట్ చేసేవారని, ఇప్పుడు వారి పరిస్థితి చూసి జనం అసహ్యించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బలిజసంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, టీడీపీ నేతలు సురేష్, రామ్‌ప్రసాద్, అలీఖాన్, అమీర్‌బాషలు పాల్గొన్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు : రెడ్యం
రాయలసీమ ప్రజలు తాము పస్తులు వుండి ఇతరులకు అన్నంపెట్టే సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నవారు. అలాంటి వారిని అవహేళన చేస్తూ మాట్లాడడం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి సరికాదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడును మోసగాడంటూ రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారని, ఆయన ఇచ్చిన బీఫారంతో మైదుకూరులో ఎందుకు పోటీ చేశావంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, టీడీపీ నేతలు మాట్లాడినవి బూతులైతే... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు మాట్లాడివి మీకు కనపడలేదా అంటూ మండిపడ్డారు. లోకేష్ అంటే వైసీపీకి భయం పట్టుకుందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాయుడు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నగర అధ్యక్షుడు అనీల్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ వాళ్లు ధర్నా చేస్తే అరెస్టులా ?
వీఎ్‌స అమీర్‌బాబు
ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నా చేస్తుంటే పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. అదే వైసీపీ నేతలు చేస్తే మాత్రం వారికి దర్జాగా అనుమతిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ అమీర్‌బాబు ప్రశ్నించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతలు చేసిన దీక్షకు మాత్రం అనుమతులు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారి ప్రతినిధి పట్టాభి తలుపులు పగులగొట్టి మరీ అరెస్టు చేశారు. ఆయన మీద తప్పుడు సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారన్నారు. పట్టాభి ఆర్థిక నేరస్తుడా లేక ఉగ్రవాదా అని ప్రశ్నించారు. నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి ప్రధాన కార్యదర్శి జయకుమార్, శివరామ్, మాస కోదండ, జింకా శ్రీను, నాసర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:09:16+05:30 IST