ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

ABN, First Publish Date - 2021-05-09T04:40:49+05:30

వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుందని వ్యవసాయ సలహా మండలి చైౖర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

జమ్మలమడుగు ధర్మాపురంలో వరి రైతులతో మాట్లాడుత్ను వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి 

జమ్మలమడుగు రూరల్‌, మే 8: వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుందని వ్యవసాయ సలహా మండలి చైౖర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘వరి రైతును వీడని కష్టాలు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన సలివెందుల రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం, సలివెందుల, గొరిగెనూరు, తదితర గ్రామాలలో పర్యటించి వరి రైతులతో మాట్లాడారు.  రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వరి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌ ధర క్వింటా రూ.1200 ఉంటే ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1888 ఉందన్నారు. ప్రభుత్వం మద్దతు ధర రైతులకు అందిస్తుందని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో ఆయన వెంట ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising